మండపేట: ఆలయాల్లో మున్సిపల్ ఛైర్మన్ రాణి పూజలు

57చూసినవారు
మండపేట: ఆలయాల్లో మున్సిపల్ ఛైర్మన్ రాణి పూజలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండపేటలోని పలు ఆలయాల్లో శుక్రవారం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి విశేష పూజలు నిర్వహించారు. మండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో వేంచేసియున్న జనార్ధన స్వామి వారి దేవాలయంలో పూజలు, కలువ పువ్వు సెంటర్ లోని శ్రీ దుర్గమ్మ 
ఆలయంలో అమ్మవారికి, తర్వాణి పేటలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్