ప్రచారంలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే అభ్యర్థి

5127చూసినవారు
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్నరీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ కార్యకర్తలతో కలిసి తీన్మార్ డప్పుల నడుమ డాన్స్ చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని మొసలపల్లి, కే. పెదపూడి గ్రామాలలో సోమవారం కూటమి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ కార్యకర్తలతో తీన్మార్ డప్పుల నడుమ డాన్స్ చేశారు. తోట్లమ్మ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో ఆయన కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్