కాట్రేణికోన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తహశీల్దార్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదన్నారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు కావచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని పేర్కొన్నారు.