ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 104 వ్యవస్థను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి 104 ఉద్యోగులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. కోనసీమ జిల్లా 104 యూనియన్ ఉపాధ్యక్షులు జగజీవన్ రావు, డీఈవో సత్య నారాయణ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. యాజమాన్యం నుంచి రావలసిన పీఎఫ్, ఇంక్రిమెంట్ బకాయి అందరికీ అందజేయాలని కోరారు.