ముమ్మిడివరం నగర పంచాయతీ 4వార్డు శివారు ఈశ్వరమ్మ గుడి (కనకదుర్గమ్మ గుడి) పెద్ద వంతెన (మురికి కోడు) కాలువ గట్టు కోతకు గురైంది. దీంతో కాలనీకి వెళ్లేందుకు సైతం దారి లేని పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడన్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గురువారం డిమాండ్ చేసారు.