ముమ్మిడివరం నగర పంచాయతి కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ పిన్నమరాజు రవివర్మ బుధవారం సమీక్ష నిర్వహించారు. అడ్మిన్ సెక్రెటరీలతో ప్రోపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ ఖాళీ స్థలం పన్నులు వసూలు పై సమీక్ష చేశారు. అన్ని రకాల పన్నుల వసూలు 100% చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. వసూళ్లలో జిల్లాలో ముమ్మిడివరం ప్రథమ స్థానంలో ఉండాలని పేర్కొన్నారు.