అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. తాళ్ళరేవు మండలం పి. మల్లవరం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరంగి ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.