యానంలో పుదుచ్చేరి ప్రజాపనుల, పర్యాటకశాఖల కార్యదర్శి డా. జయంత్ కుమార్ మంగళవారం పర్యటించారు. యానాం ప్రాంతాల్లో ప్రతి నెలా పర్యటించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ ఆదేశాల మేరకు జయంత్ కుమార్ పర్యటించారు. ఈయనను ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులను కేటాయించాలని కోరారు.