యానాం ప్రజా పనుల శాఖ కార్యాలయం ఎదుట ఆ శాఖలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు గురువారం ఆందోళన నిర్వహించారు. పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పనులు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీని అమలు చేసి, తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన బాట పట్టారు. దీనిలో భాగంగా యానం ప్రజా పనుల శాఖ కార్యాలయం ఎదుట ఆ శాఖ ఉద్యోగులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.