తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర పర్యాటక నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాటలో భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి దుర్గేశ్ ప్రార్థించారు.