భారత రాజ్యాంగం, ప్రజల సంపదను పరిరక్షించాలని సీపీఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి. అరుణ్ డిమాండ్ చేశారు. నిడదవోలులో శనివారం సీపీఎం నిడదవోలు పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా టి. అరుణ్ హాజరయ్యారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.