రాష్ట్ర ప్రభుత్వం నిడదవోలు నియోజకవర్గానికి 19 మద్యం షాపులు కేటాయించినట్టు నిడదవోలు ఎక్సైజ్ సీఐ సతీష్ బాబు బుధవారం తెలిపారు. వాటి లైసెన్సుల కోసం ఇప్పటి వరకూ 704 మంది దరఖాస్తు వచ్చాయన్నారు. నిడదవోలు టౌన్లో 153 దరఖాస్తులు చేసుకున్నారన్నారు. మండలంలోని నిడదవోలు నుంచి 160, ఉండ్రాజవరం నుంచి 172, పెరవలి నుంచి 219 దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు. కాగా దరఖాస్తుల దాఖలుకు 2 రోజుల గడువు ఉందన్నారు.