కాకినాడ జిల్లా సామర్లకోటలోని అర్బన్ హెల్త్ సెంటర్ ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ నాయక్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు ఇచ్చే టీకాలు, ఇంజక్షన్లను తనిఖీ చేశారు. యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ భవ్యశ్రీతో మాట్లాడి ఆసుపత్రికి వచ్చే రోగులకు చేసే పరీక్షలు, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్లో రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు.