బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రధాన సాగు అయిన వరి ప్రస్తుత వర్షాలు వలన నీట మునిగి తీవ్ర నష్టం ఏర్పడుతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సామర్లకోట మండలంలో సుమారు 580 ఎకరాల్లో వరి సాగు పంట నష్టం ఏర్పడినట్లు బుధవారం మండల వ్యవసాయ అధికారి ఇమిడిసెట్టి సత్య మీడియాకు తెలిపారు.