కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా )కి తుమ్మల రామస్వామిని చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్న తుమ్మల బాబు గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తరపున పెద్దాపురం నుంచి పోటీ చేయగా, ఈ దఫా జరిగిన ఎన్నికలలో టీడీపీ, బీజేపీతో కూటమిగా ఏర్పాటు కావడంతో చినరాజప్ప గెలుపునకు కృషి చేసారు. దీంతో తుమ్మల బాబుకి గుర్తింపుగా చైర్మన్ పదవి లభించింది.