సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం శివారు ఏలేరు కాలువపై శిథిల కాజ్వే తక్షణమే మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ సర్వేశ్వర రావు, మాజీ సర్పంచ్ కుర్ర రాజు తదితర రైతులు బుధవారం జిల్లా కలెక్టర్ షన్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఖరీఫ్ పంట దాన్యాన్ని పొలాల నుంచి గ్రామానికి రవాణా అవకాశాలు లేవన్నారు. ఈ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు వివరించారు.