కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన రాజబాబు మనుమరాలు జయకేతన అనే రెండేళ్ల చిన్నారి క్రిస్మస్ వేడుకలకు తన తల్లి రత్న ప్రకాశ్‌తో కలిసి తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే ఇల్లు శుభ్రపరుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బీరువా చిన్నారిపై పడింది. దీంతో కొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.