హోరాహోరీగా సాగిన విలువిద్య పోటీలు

75చూసినవారు
హోరాహోరీగా సాగిన విలువిద్య పోటీలు
పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఎర్ ప్రభుత్వ పాఠశాలలో విలువిద్య పోటీలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. చింతూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, పిఠాపురం, కిర్లంపూడి వంటి ప్రాంతాలకు చెందిన 150 మంది ఈ పోటీల్లో తలపడ్డారు. ఇందులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్టును ఎంపిక చేశారు. వీరంతా ఈనెల 22 నుంచి 24 వరకూ జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో తలపడతారని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణ, పి. లక్ష్మణరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్