ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ బుధవారం హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పవన్ కల్యాణ్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు. తదుపరి అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.