రాష్ట్రంలోనే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

63చూసినవారు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు రెండు ఓట్లను గాజు గ్లాసు గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ను మనమంతా ఆశీర్వదించాలని, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చుదిద్దుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్