

యూ. కొత్తపల్లి: సముద్రం వద్ద పెరిగిన అలల ఉధృతి
యూ. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతంలో అల్పపీడనం ప్రభావంతో బుధవారం సముద్రం వద్ద అలల ఉదృతి పెరిగింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. కెరటాలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వేట మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు పూట కూలీ గడవక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.