పిఠాపురం: వీలైనంత త్వరగా బాలికను అప్పగిస్తాం

83చూసినవారు
పిఠాపురం: వీలైనంత త్వరగా బాలికను అప్పగిస్తాం
గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసులో గురువారం పెద్దాపురం డీఎస్పీ డి. శ్రీహరిరాజు, ఎస్ఐ లక్ష్మీకాంతం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విచారణ చేస్తున్నామని, వీలైనంత త్వరగా బాలిక ఆచూకి తెలుసుకొని అతి త్వరలో అప్పగిస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్