శంఖవరం: రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలి

50చూసినవారు
శంఖవరం: రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలి
సమీకృత వ్యవసాయంతో రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ అన్నారు. శంఖవరం మండలం కత్తిపూడిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. సమీకృత వ్యవసాయంతో పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి జిల్లా వ్యవసాయాధికారి విజయ్ కుమార్ సూచించారు.

సంబంధిత పోస్ట్