వరద బాధితుల కోసం అల్కాట్ గార్డెన్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించామని కలెక్టర్ ప్రశాంతి మంగళవారం తెలిపారు. కేతావారిలంకలో 23 కుటుంబాలకు చెందిన 58 మందిని, వెదుర్లమ్మలంకలో 49 కుటుంబాలకు చెందిన 137 మందిని, గోదావరి గట్టు కింద ఉన్న 4 కుటుంబాలకు చెందిన 9 మందిని, బ్రిడ్జిలంకకు చెందిన 46 కుటుంబాలకు చెందిన 106 మందిని చందాసత్రం పునరావాస కేంద్రానికి తరలించామన్నారు.