గోదావరి వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు ముందుకు రావడం హర్షనీయమని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆనందం వ్యక్తం చేశారు. ఉదారత చాటుకుంటూ బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బుధవారం ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యతగా బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ అందించిన తీరు అమోఘం అన్నారు.