రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో 29 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి. నరసింహ కిషోర్ పోలీసు అధికారులతో కలిసి ప్రజల నుంచి ఈ ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.