రాజమండ్రి: నిరుద్యోగుల అవస్థలే నా ప్రధాన అజెండా

81చూసినవారు
నిరుద్యోగులు పడుతున్న అవస్థలే తన ప్రధాన ఎజెండా అని, వాటి పైనే చట్టసభలలో తన గళం వినిపిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జి. వి సుందర్ స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా ఎవరికి వ్యతిరేకిని కాదని, నిరుద్యోగ సమస్యల మీదే తన పోరాటం అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని నేటికీ అమలు చేయకపోవడం నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోందని వెంటనే దీనిని అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్