దీర్ఘకాలంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు క్యాప్ కార్యాలయంలో రాజమండ్రికి చెందిన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు సోమవారం వినతి పత్రం అందించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించినట్లు ముప్పాళ్ళ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రికి బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.