స్వచ్ఛతతోనే ఆరోగ్యవంతమైన సమాజం: ఎమ్మెల్యే గోరంట్ల

75చూసినవారు
స్వచ్ఛతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామ పరిధిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో గోరంట్ల పాల్గొన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూ విద్యార్థులు, అధికార, ప్రజా ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్