బొమ్మూరు నైపుణ్య కళాశాలలో ఉపాధి శిక్షణ

61చూసినవారు
బొమ్మూరు నైపుణ్య కళాశాలలో ఉపాధి శిక్షణ
రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరు నైపుణ్య కళాశాలలో ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ మరమ్మతులపై ఉద్యోగ, ఉపాధి, శిక్షణ నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా స్కిల్ కోఆర్డినేటర్ ఎ. శ్రీరామచంద్రమూర్తి బుధవారం తెలిపారు. హాస్టల్ వసతి, భోజన సదుపాయాలు సమకూర్చి ఎలక్ట్రానిక్స్ పై శిక్షణ ఇస్తారన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమో, బి. టెక్ చేసిన 18-35 సంవత్సరాల గ్రామీణులు అర్హులుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్