రాజమండ్రి రూరల్: అధికారులు సమన్వయంతో పని చేయాలి

77చూసినవారు
2027లో జరగబోయే గోదావరి అఖండ పుష్కరాలకు సంబంధించి నియమించిన కమిటీలలోని అధికారులు ముందస్తు కార్యాచరణతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. వారు చేపట్టాల్సిన పనుల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. పనుల్లో అలసత్వం వహించరాదన్నారు. అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్