విద్యార్థులతో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన... సస్పెండ్ చేసిన కలెక్టర్

65చూసినవారు
విద్యార్థులతో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన... సస్పెండ్ చేసిన కలెక్టర్
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట జడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి గురువారం సాయంత్రం ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడని విచారణలో తేలగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్