కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని రాజానగరం నియోజవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ బోడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం సందర్శించారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఆయన నియమితులైన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.