కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాలలో సాగునీటి కాలువలో పేరుకుపోయిన తుప్పలు, గడ్డిని తొలగించాల్సి ఉంది. వీటి కారణంగా కాలువలలో నీటి ప్రవాహం సరిగా జరగడం లేదని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు బుధవారం తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కాలువలలో పేరుకుపోయిన తుప్పలు, గడ్డిని తొలగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.