సీతానగరం గ్రామంలోని పంట కాలువ చెత్తతో నిండి ఉందని రైతులు వాపోతున్నారు. మండలంలో ఇదే ప్రధాన పంట కాలువ కావడంతో నీటి కొరత ఏర్పడే అవకాశం వున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలో పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, సీసా పెంకులు ఉంటున్నాయని వాటివల్ల పశువులకు గాయాలు అవుతున్నాయని రైతులు సోమవారం చెప్పారు.