రామచంద్రపురం పట్టణంలోని కృతివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కాలేజీలో ఎంపీసీ చదువుతున్న చల్లా వెంకటేష్ ఇంటర్ లో 982 మార్కులు సాధించాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో కుయ్యేరు గ్రామానికి చెందిన ఇతని తండ్రి వ్యవసాయ కూలీ. ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజీలో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించిన వెంకటేష్ ని ప్రిన్సిపల్, స్టాఫ్ శనివారం అభినందించారు.