న్యాయవాదుల చట్టసవరణకి వ్యతిరేకంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ చట్ట సవరణ న్యాయవాదుల హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. బార్ కౌన్సిళ్ల అస్తిత్వాన్ని, స్వయం ప్రతిపత్తి, ఉనికిని దెబ్బతీసే విధంగా ఉందని విమర్శించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.