రామచంద్రపురం మండలం నరసాపురపుపేటలో సోమవారం భూ రీ-సర్వే అభ్యంతరాలపై సోమవారం గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ వీరలక్ష్మి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఆర్. ఐ సత్యదేవ్ ప్రసాద్ మాట్లాడుతూ భూమి రీ-సర్వేపై రైతుల అభ్యంతరాలు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.