అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. తిమ్మాపురంలో ఇసుక తీసేందుకు వాగులో దిగిన నలుగురు యువకులు మునిగి మరణించారు. వాగులో మునిగిపోతున్న భూషణన్ని కాపాడేందుకు వెళ్లిన బాబు, గొంతయ్య, శ్రీను కూడా మరణించారు. వీరంతా ఏలేశ్వరంకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు.