రాజవొమ్మంగి: గుండెపోటుతో అంగన్వాడీ హెల్పర్ మృతి
రాజవొమ్మంగి మండలం అమ్మిరేకుల అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్‌గా పని చేస్తున్న అపు మంగ (59) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకుని వెళ్తుండగా.. ఎర్రవరం వద్ద ప్రైవేట్ బస్ ఎక్కుతూ కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు. అంత్యక్రియల కోసం ఆర్థికసాయం చేసినట్లు వర్కర్స్ యూనియన్ నేత వెంకటలక్ష్మి తెలిపారు.