ఇందుకూరులో మంచినీటి సమస్య పరిష్కరించాలి

69చూసినవారు
ఇందుకూరులో మంచినీటి సమస్య పరిష్కరించాలి
దేవీపట్నం మండలంలోని ఇందుకూరు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నుంచి వీధుల కొళాయిల్లో మంచినీరు రాక వారం రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆదివారం తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇందుకూరులో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్