AP: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే విషయం చెప్పింది. రాష్ట్రంలో పెరిగిన కూరగాయల ధరల స్థిరీకరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కూరగాయలు, ఇతర పంటల ధరల పర్యవేక్షణపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూరగాయల ధరల్లో హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ధరలు స్థిరీకరించాలని, రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.