తాటి బెల్లం తయారీ ద్వారా లాభాలు అర్ధించవచ్చు..

2262చూసినవారు
గిరిజనులు సేకరించిన తాటికల్లు ద్వారా సొంతంగా తాటి బెల్లం తయారీ చేయడం ద్వారా లాభాలు అర్ధించవచ్చని కృషి విజ్ఞాన క్షేత్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకయ్య అన్నారు. వై రామవరం మండలం చవితి దిబ్బల గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన తాటి బెల్లం తయారీ ప్రదర్శనకు గిరిజనలు హాజరయ్యారు. తాటికల్లు సేకరించేవారు తమ దగ్గర ఉన్న తాటికల్లుతో తాటి బెల్లాన్ని, తాటిపాకాన్ని తయారుచేసి మార్కెట్లో అమ్మవచ్చని తాటి బెల్లానికి, తాటిపాకానికి మార్కెట్లో గట్టి గిరాకీ ఉందన్నారు. గ్రామస్తులకు తాటి బెల్లం తయారీ విధానాన్ని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్