ఏరియా ఆసుపత్రిలో ఆర్థో సర్జరీ విజయవంతం

1897చూసినవారు
ఏరియా ఆసుపత్రిలో ఆర్థో సర్జరీ విజయవంతం
చింతూరు ఏరియా ఆసుపత్రిలో శనివారం నాడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి చింతూరు ఆర్థో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు. చట్టీ గ్రామానికి చెందిన చల్లా రామకోటి ఈ నెల 26న ఒడిసా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో చెయ్యి మణికట్టు ఎముక విరిగింది. మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఎంవీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కౌషిక్ రెడ్డిలు విరిగిన చేతికి ఆపరేషన్ ద్వారా ప్లేట్ ను అమర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్