రంపచోడవరం: పర్యాటకులతో కిటకిటలాడిన ఏజెన్సీ ప్రాంతం

61చూసినవారు
దేవీపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్లారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చారని, బోట్ పాయింట్ అంతా పర్యాటకులతో నిండిపోయిందని టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. శనివారం ఒక్కరోజే 13 పర్యాటక బోట్లు గోదావరి నదిలో ప్రయాణిస్తున్నాయని, 1, 200 మంది పర్యాటకులు విహారయాత్రకు వెళ్లినట్లు తెలిపారు. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు అందించామన్నారు.

సంబంధిత పోస్ట్