కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు భర్తీ ప్రక్రియలో భాగంగా జిసిసి డైరెక్టర్ గా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వంపురి గంగులయ్య నియమితులైయ్యారు. బుధవారం గంగవరం మండలం జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు కుంజం సిద్దు, ఉపాధ్యక్షులు రాజు, విష్ణు, నాయకులు గణేష్, వీరాజు, అబ్బాస్, గోపాల్, గోవింద్, అనిల్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. జిసిసి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.