రంపచోడవరం మండలం ఐ. పోలవరం గోవిందగిరి వెంకటేశ్వర స్వామిని ఆదివారం రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆమె భర్త జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు నారాయణరాజు సిబ్బంది, గోవింద గిరి శ్రీవారి సేవక బృందం కోఆర్డినేటర్ నల్లమిల్లి వెంకట రామారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు సాయిరాం శర్మ, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.