జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు

84చూసినవారు
జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు
AP: వైసీపీ అధినేత జగన్ పై బుధవారం కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో పర్యటించాడని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ.. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్