రంపచోడవరం నియోజకవర్గంలోని డీఎడ్ కళాశాలలో పనిచేస్తున్న పీడి పోతురాజుపై చట్టపరంగా శిక్ష పడాల్సిందేనని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం ఆమె రంపచోడవరంలోని డీఎడ్ కళాశాల వద్ద సందర్శించి గిరిజన విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కళాశాల పీడి పోతురాజు తీరును విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.మాట్లాడుతూ, పీడి పోతురాజు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు.