వాగ్దానాలను అమలు చేయడంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మలికిపురం వైసీపీ కార్యాలయంలో గురువారం రైతు విభాగం సమావేశం జరిగింది. సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి వాటిని అమలు చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. సమావేశంలో శివకుమార్, చంద్రశేఖర్, రమేశ్, సూరిబాబు, జానకిరామ్ పాల్గొన్నారు.